కార్మికుల శ్రమ ఫలమే సమస్త సంపదలు : కేసీఆర్‌

శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు ‘మే డే’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) అన్నారు. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు (May Day Wishes). ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

‘శ్రామిక జనుల విజయ స్ఫూర్తిని చాటే ‘మే డే’ సందర్భంగా.. తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు. మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు. మీకు శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.