తెలంగాణ రాష్ట్రంలో 301.03 కోట్లు సీజ్‌ : సీఈవో వికాస్‌రాజ్‌

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రూ.301.03 కోట్ల నగదు, విలువైన వస్తువులను సీజ్‌ చేశామని రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘించడం వల్ల 8,481 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెప్పారు. మొత్తం 2,64,043 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 2,29,072 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారని తెలిపారు. వీరిలో 34,973 మంది ఉద్యోగులు ఈడీసీ ఎంపిక చేసుకొన్నారని చెప్పారు. బుధవారం నాటికి 1,75,994 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హకును వినియోగించుకొన్నారని, ఈ ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనున్నదని వివరించారు.