13వ తేదీన వేత‌నంతో కూడిన సెల‌వు.. ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

తెలంగాణలో ఈ నెల 13వ తేదీన‌ 17 ఎంపీ స్థానాల‌కు ఎన్నిక‌లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వు విష‌యం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మే 13న వేత‌నంతో కూడిన సెల‌వు మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ ఉత్తర్వులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ సెలవు నిబంధనలను కచ్చితంగా అన్ని కంపెనీలు, సంస్థలు అమలు చేయాలని వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని, లేదంటే తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. అయితే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.