చింత‌మ‌డ‌క‌లో ఓటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంప‌తులు

 సిద్దిపేట జిల్లాలోని చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న స‌తీమణి శోభ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్ బాగా జ‌రుగుతోంది. 65 శాతానికి మించి పోలింగ్ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల‌దే కీల‌క పాత్ర అవుతుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.