పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. పులివెందుల భాకరాపురం జయమ్మ కాలనీలోని 138వ పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.

ఈ సందర్భంగా క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఓటేయాలని కోరారు. కాగా, అంతకుముందు అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి అంటూ ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు. మరోవైపు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఓటువేశారు. సతీమణి భువనేశ్వరితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన బాబు.. తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.