ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సాయి ప్రణీత్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సాయి ప్రణీత్ మాట్లాడుతూ.. క్రీడలు ఉత్సాహంగా ఆడాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆటగాళ్లు చాన్ పెంగ్ సూన్(మలేషియా), షియా(ఇండోనేషియా), బివెన్ జాంగ్(అమెరికా), శ్రేయన్స్ జైస్వాల్, హేండ్రా స్టీవాన్(ఇండోనేషియా), రితుపర్ణ దాస్, అజయ్ జయరాం, తన్వీ లద్, రుత్విక గద్దెఎ, కౌశల్ ధర్మేందర్, అష్మిత చల్లయ్య, క్రిష్ణ ప్రసాద్ గరగా, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.