TS నుండి TG గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల..

తెలంగాణ రాష్ర్టాన్ని సూచించే అధికారిక సంక్షిప్త నామాన్ని ప్రభుత్వం ‘టీజీ’గా మారుస్తూ సీఎస్‌ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాలని సూచించారు.

జీవోలు, పాలసీ పేపర్లు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్‌ హెడ్స్‌, అధికారిక పత్రాల్లో టీజీ వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే టీఎస్‌ పేరుతో ముద్రించిన పత్రాలను ఏం చేయాలనే దానిపై ఈ నెలాఖరుకు నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు.