రూ. 38 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవసాయాధికారి

 వ్యవసాయానికి సంబంధించిన దుకాణం రెన్యువల్‌ కోసం వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల వ్యవసాయ అధికారి వంశీ కృష్ణ (AO Vamsi Krishna) సోమవారం రూ. 38 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు.

ఏసీబీ డీఎస్పీ(ACB DSP) రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అయినం గ్రామానికి చెందిన మారుతి ట్రేడర్స్ యజమాని చౌదరి శ్యామ్ రావు రెన్యువల్(Renewal) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే డబ్బులు ఇవ్వనిదే పని కాదంటూ డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా పక్కా వ్యూహాన్ని రూపొందించారు.

సోమవారం కార్యాలయంలో బాధితుడు రూ. 38 వేలు ఏవోకు అందజేయగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకోవడం నేరం కావడంతో అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.