- వరుస ప్రమాదాలతో బిక్కుబిక్కుమని బతుకుతున్న కార్మికులు
జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో ల్యాబ్స్ పరిశ్రమలో సోమవారం సాయంత్రం టీ టైంలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ రసాయన ట్యాంకులు పేలడంతో కార్మికులకు ప్రమాదం తృటిలో తప్పింది. భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డ కార్మికులు గేటు బయటకు పరుగులు తీశారు. తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అక్కడే ఉన్న హెటిరో వారి ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారుగా ఆస్తి నష్టం బాగా జరిగిందని స్థానికులు తెలిపారు.
పారిశ్రామిక వాడలోని కార్మికుల వివరణ…
నిత్యం ఘాటైన వాసనలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. రెక్క ఆడితే గాని డొక్కాడని పరిస్థితి బ్రతుకులు మావి. నిత్యం పరిశ్రమలో ఏమి జరుగుతుందో ఏమవుతుందో అన్న భయంతో విధులు నిర్వహిస్తున్నాం. అర్హతగల కెమిస్ట్ లను విధుల్లో పెట్టుకుని విధులు నిర్వహిస్తే బాగుంటుందని కొందరు కార్మికులు వాపోతున్నారు. ఎలాంటి పనులపట్ల అవగాహన లేని వ్యక్తులను తీసుకొని ఇలాంటి ప్రమాదాలకు తావిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా యంత్రాంగం పట్టించుకోని పారిశ్రామికవాడలోని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.