- 12 ఏళ్ల తర్వాత ఏసీబీ(ACB) తనిఖీలు
- పలువురు ఏజెంట్లు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ(ACB) అధికారులు ఇవాళ మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నల్లగొండతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ తనిఖీల్లో పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లెక్క చూపని నగదు లభ్యం అయినట్లు తెలుస్తోంది. అయితే రవాణా శాఖలో ఏజెంట్ల ద్వారా జరుగుతున్న దందాపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. పలుచోట్ల రెయిడ్స్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మలక్ పేట, పాతబస్తీ బండ్లగూడ, టౌలిచౌకి, మహబూబ్ నగర్ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.