తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్‌ శాంతికుమారి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నా యి. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారు.

జూన్‌ 2 ఉదయం సీఎం గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి, నివాళులర్పిస్తారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సీఎస్‌ శాంతికుమారి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.