ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీ ఓటమి దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. ఓటమి నేపథ్యంలో గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు.
ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం – జనసేన- బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థులే లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 132 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. రెండు స్థానాలకుపైగా కైవసం చేసుకుంది. అధికార వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక జనసేన 20 స్థానాలు, బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.