టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని రేవంత్ ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరారు.
