తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్‌ రెడ్డి

ఈనాడు అధినేత రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రామోజీరావు మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని చెప్పారు. ఆయన మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.