తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. పలువురు కలెక్టర్లకూ స్థాన చలనం

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా పలువురు కలెక్టర్లను కూడా మర్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే తెలంగాణలో జిల్లా కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. బదిలీ అయిన ఐఏఎస్‌ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ముజామిల్ ఖాన్‌ను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ను నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌గా, ట్రాన్స్‌కో జేఎండీ సందీప్ కుమార్ ఝాను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా, అనురాగ్ జయంతిని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా, నిర్మల్‌ కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌ను కామారెడ్డిజిల్లా కలెక్టర్‌గా, జితేష్ వి పాటిల్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా, రాహుల్ శర్మను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా, హన్మకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా, పీ ప్రావీణ్యను వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ నుంచి హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా, సత్యప్రసాద్‌ను ఖమ్మం అదనపు కలెక్టర్‌ నుంచి జగిత్యాల కలెక్టర్‌గా బదిలీ చేశారు.

కోయ శ్రీహర్షను పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా, విజయేంద్ర బోయిని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా, కుమార్‌ దీపక్‌ను మంచిర్యాల కలెక్టర్‌గా, ప్రతీక్ జైన్‌ను వికారాబాద్‌ కలెక్టర్‌గా, నారాయణరెడ్డి వికారాబాద్‌ కలెక్టర్‌గా, ఆదర్శ సురభిని వనపర్తి జిల్లా కలెక్టర్‌గా, తేజస్‌ నంద్‌లాల్‌ను సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా, సత్య శారదాదేవిని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, టీఎస్‌ దివాకరను ములుగు జిల్లా కలెక్టర్‌గా, అభిలాష అభినవ్‌ను నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.