తెలంగాణ రాష్ట్రంలోని వర్సిటీ వీసీల పదవీకాలం పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల ఇన్‌ఛార్జీ వీసీల పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇన్‌ఛార్జి వీసీలు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు ప్రస్తుతం ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జి వీసీలుగా నియమిస్తూ మే 21న ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 15వ తేదీ వరకు వాళ్లు ఇన్‌ఛార్జి వీసీలుగా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. నేటితో వాళ్ల పదవీకాలం ముగియడంతో తాజాగా వారి పదవీకాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.