లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌

వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) ఏసీబీ(ACB) కి రెడ్‌ హ్యెడెండ్‌గా పట్టుబడ్డాడు. నెల్లూరు జిల్లాలో శివశంకర్‌ అనే ఏఈ విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ కోసం రూ. 80 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో వినియోగదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా మంగళవారం వ్యూహం ప్రకారం పట్టుకున్నారు.

విద్యుత్‌ ఏఈ కార్యాలయంలోనే రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఏఈని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయించాలని కోరారు.