- ప్రధాన రక్షణాధికారిగా సీనియర్ మహిళా ఐఎఫ్ఎస్ అధికారిణి..?
- అంతర్గత బదిలీలు వివాదం కావడంతో ప్రభుత్వం నిర్ణయం
- మూడేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులపై వేటు..
- తెలంగాణ పిసిబి(PCB)లో కూడా బదిలీలు ఉంటాయా..?
అటవీశాఖలో అధికారులు, ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. పోడు భూముల వివాదాలు, పలువురు రేంజ్ ఆఫీసర్లపై వస్తున్న ఫిర్యాదులతో పాటు నెలాఖరున వైల్డ్ లైఫ్ చీఫ్ మోహన్ చంద్ర ఫర్గెయిన్ ఉద్యోగ విరమణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులని మార్చాలని నిర్ణయించింది. ప్రధాన రక్షణాధికారిగా ప్రస్తుతం సీఎంవోలో పనిచేస్తున్న ఉన్నతాధికారి లేదా సీనియర్ మహిళా అధికారిణిని నియమించే అవకాశాలున్నట్టు సమాచారం. అంతర్గతంగా జరిగిన బదిలీలు వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
అటవీశాఖలో అధికారుల బదిలీలల ప్రక్రియ పూర్తి అయిన తరువాత తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా బదిలీలు ఉంటాయని సమాచారం. పిసిబి (PCB)లో కూడా కొంత మంది అధికారుల అవినీతిపై అనేక పిర్యాధులు వస్తున్నాయని అలాగే మూడేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులని మార్చాలని సైతం పలువురు పిర్యాధు చేసినట్లు సమాచారం. పిసిబి (PCB)కి పూర్తి సమయం కేటాయించే మెంబర్ సెక్రటరీ రావడం శుభపరిణామం అని పలువురు మేధావులు, పర్యావరణ వేత్తలు అన్నారు. కొత్త మెంబర్ సెక్రటరీ అధ్వర్యంలో పిసిబి కాలుష్య బాధితులకు అండగా ఉండాలని అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేధావులు, పర్యావరణ వేత్తలు తెలిపారు.