ప్రభుత్వ అధికార లాంఛనాలతో డీఎస్‌ అంత్యక్రియలు

పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత డీ. శ్రీనివాస్‌ (D.Srinivas) కన్నుమూశారు. గతకొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నివాసంలో ఉన్న ఆయన భౌతికకాయాన్ని మధ్యహ్నం నిజామాబాద్‌కు తరలించనున్నారు. ఆదివారం ఉయదం నిజామబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డీఎస్‌ మృతి చెందారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌లోని నివాసానికి తరలించారు. ప్రజలు, అభిమానులు, నాయకుల సందర్శనార్ధం మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన భౌతికకాయాన్ని అక్కడ ఉంచనున్నారు. అనంతరం నిజామాబాద్‌ పట్టణానికి తరలిస్తారు. రేపు ఉదయం నిజామాబాద్‌లో డీఎస్‌ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.