డి.శ్రీనివాస్‌కు నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

 నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత డీఎస్ కుమారులు సంజయ్, అరవింద్‌తో మాట్లాడి సీఎం ఓదార్చారు. కాంగ్రెస్‌ పార్టీకి శ్రీనివాస్‌ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.  ఆయన వెంట ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

కాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ (75) కన్నుమూశారు. కొద్దికాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. డీఎస్‌ మృతిపై ప్రధాని మోదీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు.