హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కొడంగల్‌లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చించారు. రెసిడెన్షియ ల్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా కొడంగల్‌ నియోజకవర్గంలో ప్రతిరోజు 28వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

కొడంగల్ పట్టణంలో ఇప్పటికే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, హరే రామ-హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, సీఎస్ఆర్ ఫండ్స్‌తో దీనిని చేపడుతున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాలని ఫౌండేషన్ సభ్యులకు సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని సీఎం స్పష్టం చేశారు.