ఊపిరితిత్తుల వ్యాధికి కారణమయ్యే పరిశ్రమలను పరిశీలించండి.. ఎన్జీటీకి సుప్రీంకోర్టు ఆదేశం

దేశంలో దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధి(సిలికోసిస్)కి కారణమవుతున్న సిలికాన్ ధూళిని వెదజల్లే పరిశ్రమలను పరిశీలించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రమాదకరమైన సిలికాన్ ధూళి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లపై ఉంటుందని తెలిపింది. అయితే, అవి సరైన చర్యలు తీసుకుంటున్నాయో లేదో పరిశీలించాలని జస్టిస్ విక్రమ్ నాధ్, జస్టిస్ ప్రసన్న బాలాచంద్ర వరాలే సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం పేర్కొంది. పీపుల్స్ రైట్స్, సోషల్ రీసెర్చ్ సెంటర్ సంస్థలు 2006లో దాఖలు చేసిన పిటిషన్ ను పరిష్కరిస్తూ ఈ ఆదేశాలు వెలువరించింది.