నిఘా నేత్రం న్యూస్ : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి మరియు మాతృత్వ స్ఫూర్తిని గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు “ఏక్ పెడ్ మా కే నామ్” ప్రచారంతో ఈ రోజు సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
టీజీపీసీబీ చీఫ్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ బి.రఘు మొక్కలు నాటి, ప్రచారాన్ని ప్రారంభించగా, పలువురు పీసీబీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజిపిసిబి సిఇఇ రఘు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో చెట్ల పెంపకం ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ ప్రచారాన్ని ప్రారంభించడం మాకు గర్వకారణం, ఇది పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడటమే కాకుండా తల్లుల షరతులు లేని ప్రేమను తెలియచేస్తుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ అధికారులు పాల్గొని ప్రధాన కార్యాలయంలోని పీసీబీ సిబ్బందికి మొక్కలు పంపిణీ చేశారు.