రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆదిలాబాద్ డీఎఫ్‌వో డా.బి. ప్రభాకర్ స్వీకరించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మావల అర్బన్ పార్క్‌లో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమం ప్రారంభించి, దాని ద్వారా కోట్ల మొక్కలు నాటే విధంగా ఎంతో మందిని ఇందులో భాగస్వామిని చూస్తూ ఇంత విజయవంతంగా కార్యక్రమం జరగడానికి కారణమైన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలను మనం కాపాడితే వృక్షాలు మనలను కాపాడుతాయి. ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 1) సుతాన్ నిర్మల్ డీఎఫ్‌వో, 2) రాజేంద్రకుమార్ అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీ, హైదరాబాద్, 3) గంగాకిషన్, జిల్లా సైన్స్ అధికారి, డీఈవో నిజామాబాద్‌లకు మొక్కలు నాటాలని సవాల్ విసిరారు.