గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సిటీ సివిల్ కోర్ట్ న్యాయవాదులు

రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ చలేంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సిటీ సీవీల్ కోర్టు న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో సిటీ సీవీల్ కోర్ట్ అధ్యక్షుడు జెగదీశ్వర్ రావు, కార్యదర్శి జానకి రాములు, అడ్వొకేట్ సొసైటీ సెక్రెటరీ కె.తిరుపతయ్య, అడ్వాకేట్ జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్ధన్ రెడ్డి, అధికార ప్రాతినిది ఉపేందర్, హోల్డ్ సిటీ న్యాయవాది జేఏసీ మనిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష , కార్యదరుషులు, సభ్యులచే మొక్కలు నాటించిన తెలంగాణ అడ్వాకేట్ జేఏసీ నేతలు గోవర్ధన్ రెడ్డి, ఉపేందర్

సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రతి న్యాయవాది స్పూర్తిగా తీసుకొని ఒక మొక్కను నాటాలని పిలుపునిచిన …సిటీ సివిల్ కోర్ట్ న్యాయవాదులు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని చెట్ల తెలంగాణను ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారని సిటీ సీవీల్ కోర్ట్ అధ్యక్షుడు జెగదీశ్వర్ రావు అన్నారు..

మొక్కలను మనం కాపాడితే ..మొక్కలు మన ప్రాణాన్ని కపడుతాయి అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరిన..అధికార ప్రతినిధి ఉపేందర్ ప్రపంచం గ్లోబల్ వార్మ్ తో బాధపడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం లో అనేక పరియవరణ పరిరక్షణ చర్యలు తీసుకున్న మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారు అని …అడ్వాకేట్ జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్ధన్ రెడ్డి తెలిపారు.