సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శీను ఓ వ్యక్తి నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.