పీసీబీలో అవినీతి కంపును వదిలించేందుకు రంగం సిద్ధం

  • రాష్ట్ర విజిలెన్స్ శాఖకు చేరిన పీసీబీ అవినీతి అధికారుల చిట్టా
  • రహస్యంగా కూపీ లాగుతున్న రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు
  • అవినీతి, తప్పుడు అధికారులను కాపాడుతున్నదేవరు..?
  • ఫెక్ సర్టిఫికెట్లు ఇచ్చి కోట్లు కొల్లగొట్టిన అధికారులు ఎవరు..?
  • పీసీబీ ల్యాబ్ లల్లో ఏం జరుగుతుంది..?
  • సీఎఫ్ఓ లేకుండా పరిశ్రమలు నడుస్తున్న పట్టించుకొని అధికారులు ఎవరు..?
  • పీసీబీకి ఆర్.టి.ఐ. యాక్ట్ వర్తించదా..?
  • అసలు తెలంగాణ పీసీబీలో ఏం జరుగుతుంది..?

ప్రజల ఆరోగ్యాలను క్షీణింపజేసే ప్రాణాంతకమైన కాలుష్యం చేస్తున్న పరిశ్రమలను.. రసాయన వ్యర్థ పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో యధేచ్చగా వదులుతున్నాగానీ పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై కొరడా జులిపించేందుకు రంగం సిద్ధమైంది. పీసీబీ అధికారులకు అదేపనిగా అలవాటైన అవినీతి కంపును వదిలించేందుకు రాష్ట్ర విజిలెన్స్ శాఖ ఆధారాలను సేకరించే పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికే పలువురు పర్యావరణ వేత్తల ద్వారా ఫిర్యాదులు కూడా అందినట్లు విశ్వసనీయ సమాచారం. కాలకూట విషం లాంటి కాలుష్యం, వ్యర్థాలు ప్రజల ఆయుష్షును తగ్గిస్తున్న కాలుష్య పరిశ్రమలు, ఫార్మా కంపెనీలపై కొరడా జులిపించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి మామూళ్ల మత్తుల్లో జోగుతున్న అధికారుల భరతం పట్టేందుకు రాష్ట్ర విజిలెన్స్ శాఖ రహస్యంగా ఆరా తీస్తున్నట్లు తెలియవచ్చింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరుపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న విమర్శలపై రాష్ట్ర స్థాయిలోని విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు అవినీతి కంపులో కూరుకపోయిన పీసీబీ అధికారుల బాగోతాల చిట్టాపై వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రామగుండం, సూర్యాపేట, యదాద్రి భువనగిరి, జోగులంబ గద్వాల, వనపర్తి, కరీంనగర్ మొదలగు జిల్లాల పరిధిలో కొనసాగుతున్న కాలుష్య పరిశ్రమలు, ఫార్మా కంపెనీల్లో కొన్ని కంపెనీల నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రాణాంతకమైన విష రసాయన పదార్ధాలను వదులుతున్న వ్యవహారాలపై కొరడా జులిపించాల్సిన పిసిబి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారిస్తున్నారు. రసాయన పరిశ్రమల్లో నిబంధనలను గాలికి వదిలేస్తూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్న ఫార్మా కంపెనీల వ్యవహారాలపై పలువురు పర్యావరణ వేత్తల ద్వారా వెలుగులోకి రావడంతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు ఇతర అనుబంధ శాఖల అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లా జిన్నారం, పటాన్ చెరు, గడ్డ పోతారం, పాశ మైలారం మరియు యదాద్రి భువనగిరి జిల్లా దొతిగూడెంలో వరుస ఫిర్యాదులతో వ్యర్థ రసాయనాల మాఫియా ఆగడాలపై అధికారులు స్పందించే తీరును ఆయా జిల్లాల మంత్రులు అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జెండగేతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు రాష్ట్ర స్థాయిలోని పీసీబీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా కళ్ళు తెరిచిన కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను విస్మరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న రసాయన పరిశ్రమల నిర్వాహకులపై కొరడా జలిపించేందుకు రంగం సిద్ధమైంది. అందుకు కారణమైన రసాయన కంపెనీలను మూసివేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో కూడా కొంత మంది అధికారులు తమ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని పలువురి ఆరోపణ. మంత్రుల మాటలను సైతం పీసీబీ అధికారులు పట్టించుకోవడం లేదు అని తెలుస్తుంది. పీసీబీ అధికారులపై పలువురు మంత్రులు కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

  • పీసీబిలో అవినీతి, తప్పుడు అధికారులను కాపాడుతున్నదేవరు..?
  • ఫెక్ సర్టిఫికెట్లు ఇచ్చి కోట్లు కొల్లగొట్టిన అధికారులు ఎవరు..?
  • పీసీబీ ల్యాబ్ లల్లో ఏం జరుగుతుంది..?
  • సీఎఫ్ఓ లేకుండా పరిశ్రమలు నడుస్తున్న పట్టించుకొని అధికారులు ఎవరు..?
  • పీసీబీకి ఆర్.టి.ఐ. యాక్ట్ వర్తించదా..?
  • అసలు తెలంగాణ పీసీబీలో ఏం జరుగుతుంది..?
    త్వరలో మీ ముందుకు తీసుకువస్తుంది. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…