అరబిందో కంపెనీని తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యర్థాలను వదిలితే ఫార్మా కంపెనీలను తగలబెడుతా.. రైతుల భూములు నాశనం చేద్దామనుకుంటున్నారా..? అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్ నుంచి పంట పొలాలకు అరబిందో, హెటిరో, శిల్ప కంపెనీలు కలుషిత నీటిని విడుదల చేస్తున్నాయని స్థానిక రైతులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలుషిత నీటి విడుదల ఆపకపోతే అరబిందో కంపెనీని తగలబెడతానని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే కలుషిత నీటి సరఫరా జరుగకుండా చూడాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అరబిందో కంపెనీ వారు మా దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకులను, అధికారులను అయిన కొనుక్కుంటమని అనుకుంటున్నారేమో ఇక్కడ ఉన్నది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ఇన్ని వేల కోట్లు సంపాదించారు. అయిన వ్యర్ధాలను వదలడానికి సిగ్గు ఉన్నదా మీకు.. అసెంబ్లీలో మాట్లాడినా మారలేదు. మీ దగ్గర పైసలు ఉంటే మీ ఇంట్లో పెట్టుకోరి.. అవినీతి అధికారుల సంగతి కూడా చూస్తా.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
