దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ ప్రజలందరికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలందరి ఇండ్లలో చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించాలని, శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని ఎంపీ చామల ఆకాంక్షించారు.
టపాకాయలు కాల్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాల్సిందిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు.