టీజీపీఎస్సీ చైర్మ‌న్ నియామ‌కానికి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ నియామ‌కానికి సోమ‌వారం సాయంత్రం విడుద‌లైంది. న‌వంబ‌ర్ 20న సాయంత్రం 5 గంటల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అవ‌కాశం క‌ల్పించారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. టీజీపీఎస్సీ ప్ర‌స్తుత చైర్మ‌న్ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ద‌వీకాలం ఈ ఏడాది డిసెంబ‌ర్ 3వ తేదీతో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీజీపీఎస్సీ నూత‌న చైర్మ‌న్ కోసం ప్ర‌భుత్వం కొత్త‌గా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.