వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయడానికి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడిని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్, నవీన్ గౌడ్ లు తీవ్రంగా ఖండించారు. జిల్లా కలెక్టర్, ప్రజల అభిప్రాయాలను వినడానికి మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహించిన సందర్భంలో ఆయనపై దాడి జరగడం చాలా దురదృష్టకరం మరియు అప్రజాస్వామిక చర్య అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లడానికి నిరంతరం కృషి చేసే జిల్లా కలెక్టర్ పై జరిగిన ఈ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికారుల పట్ల గౌరవం, ప్రజాస్వామ్య విధానాల పట్ల అంకితభావం ఉండాలని, ఈ సంఘటనలో బాధ్యులైన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.