తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో బుధవారం జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, జనవరి 26 నుంచి రైతుభరోసా ఇవ్వనున్నామని తెలిపారు. పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ైప్లెఓవర్కి మాజీ ప్రధాని దివంగత మన్మోహన్సింగ్ పేరు పెట్టినట్టు తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.