లాయర్ తో కలిసి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్‌ ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లారు. అంతకుముందు నందినగర్‌లోని తన నివాసంలో లీగల్‌ టీమ్‌తో చర్చించారు. అందేవిధంగా ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. కాగా, కేటీఆర్‌ ఏసీబీ విచారణకు వెళ్తుండటంతో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు.