తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను మం జూరు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. గ్రామసభల నిర్వహణ, ప్రజల స్పందన, నాలుగు పథకాలకు సంబంధించిన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దనసరి అనసూయ మంగళవారం ఉదయం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మొక్కుబడిగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చవుతాయని వెల్లడించారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారు వెంటనే చేసుకోవాలని సూచించారు.
