తెలంగాణ హైకోర్టులో న‌లుగురు న్యాయ‌మూర్తుల ప్ర‌మాణ‌స్వీకారం

తెలంగాణ హైకోర్టుకు కొత్త‌గా నియ‌మితులైన న‌లుగురు అద‌న‌పు న్యాయ‌మూర్తులు శ‌నివారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. జ‌స్టిస్ రేణుకా యారా, జ‌స్టిస్ నందికొండ న‌ర్సింగ్ రావు, జ‌స్టిస్ ఇ తిరుమ‌ల‌దేవి, జ‌స్టిస్ బీఆర్ మ‌ధుసూద‌న్‌రావుతో హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ సుజ‌య్ పాల్ ప్ర‌మాణం చేయించారు.

ఇంత‌కుముందు రేణుక యారా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా, నందికొండ న‌ర్సింగ్ రావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జ‌డ్జిగా, తిరుమ‌లాదేవి హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్, విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా, బీఆర్ మ‌ధుసూద‌న్ రావు హైకోర్టు రిజిస్ట్రార్(ప‌రిపాల‌న‌)గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

ఇక 42 మంది న్యాయ‌మూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్ర‌స్తుతం 26 మంది సేవ‌లందిస్తున్నారు. ఈ న‌లుగురి నియామ‌కంతో ఆ సంఖ్య 30కి చేరింది.