- ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు
- 2024 సంవత్సరంలోనూ 152 అవినీతి కేసులు
- అధికారులు అవాక్కయ్యేలా విచారణలో విస్తుపోయే అక్రమాస్తులు
- పట్టుబడుతున్నా మారని అవినీతి ఉద్యోగుల తీరు
- అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే పరిస్థితి
అధికారులు అవాక్కయ్యేలా అక్రమాస్తులు..
లంచం సొమ్ముకు కక్కుర్తి పడి అనేక మంది ఉద్యోగులు ఏసీబీకి చిక్కుతున్నారు. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 19 కేసులు నమోదు కాగా.. 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ఇందులో ఇద్దరు పోలీసు శాఖకు చెందిన వారు ఉన్నారు. 2024లో 152 అవినీతి కేసులు నమోదు చేసిన ఏసీబీ 223 మందిని అరెస్టు చేసింది. ఆయా కేసుల విచారణలో రూ. వందల కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఏసీబీ వరుస దాడులు చేస్తూ కరప్టెడ్ ఆఫీసర్స్ ను రెడ్ హ్యాం డెడ్ గా పట్టుకుంటున్నా.. అవినీతి ఉద్యోగుల్లో ఏ మాత్రం భయం కనిపించడం లేదు.
ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కొన్ని కేసుల విచారణలో అధికారులే ఆశ్చర్యానికి గురయ్యేలా అక్రమ ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో పట్టుబడ్డ ఇరిగే షన్ శాఖ ఏఈఈ ఆస్తులపై విచారణ చేయగా వందల కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా హెచ్ఎండీఏకు చెందిన ఓ అధికారి కూడా వందల కోట్లకు పడ గలేత్తాడని ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఓ తహసీల్దార్ ఆస్తులను గుర్తించిన సమయంలో పెద్ద ఎత్తున వెండి, బంగారు నగలను చూసి ఏసీబీ అధికారులు నోరెళ్లబె ట్టారు. లంచాలకు అలవాటు పడిన అధికా రులు ఒకరిని మించి మరొకరు ఆస్తులను పోగే సుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.
అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఎంతో మంది ప్రభుత్వాధికారులు ఏసీబీ పట్టుబడుతూనే ఉన్నారు. రూ.వెయ్యి నుంచి రూ. లక్షల్లో లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు ఉన్నారు.
ఏసీబీ వలలో 159 మంది ప్రభుత్వ ఉద్యోగులు 2024లో ఏసీబీ మొత్తం 152 కేసులు నమోదు చేసింది. 223 మంది నిందితులను అరెస్టు చేసింది. వీటిలో 129 ట్రాప్ కేసులు 200 మంది నిందితులను అరెస్టు చేయగా వారిలో 159 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 2024లో నమోదు చేసిన 129 ట్రాప్ కేసుల్లో తెలంగాణ ఏసీబీ మొత్తం రూ.82 లక్షల పైగా నగదును పట్టుకుంది. పట్టుకున్న నగదులో రూ.64లక్షలు ఫిర్యాదుదారులకు తిరిగి చెల్లించింది. 11 కేసుల్లో రూ.97కోట్ల విలువైన అక్రమాస్తులను నిందితుల ఆస్తులకు అటాచ్ చేశారు.
గత జనవరి నెలలో అవినీతి నిరోధక శాఖ మొత్తం 19 కేసులను నమోదు చేయగా అందులో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరూ పోలీస్ శాఖకు చెందిన వారు ఉండటం గమనార్హం. వివిధ శాఖల ట్రాప్ కేసుల్లో రూ.1.45 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఉద్యోగుల ఆక్రమ ఆస్తుల కేసుల్లో రూ.65 లక్షల విలువైన అక్రమాస్తులు బయటపడ్డాయని అధికారులు పేర్కొన్నారు.
ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల జాబితా…
* నవంబర్ 2న అసిఫాబాద్ జిల్లాలోని జెన్నూరు తహసీల్దార్, కార్యదర్శి ఇద్దరూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రోడ్డు కాంట్రాక్ట్ బిల్లు చెల్లింపుల విషయంలో రూ.12వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
* నవంబర్ 2న మహబూబ్ నగర్ డీఈవో రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. పదోన్నతి పెంపులో ఓ ఉపాధ్యాయురాలిని లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చింది. గతంలో మరో రెండు లక్షలు లంచం ఇదే ఉపాధ్యాయురాలి నుండి తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
* నవంబర్ 8న నిజామబాద్ జిల్లా వర్ని ఎస్సె రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వర్ని మండంలో జరిగిన గొడవ కేసులో రూ.50 వేలు డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ కు పట్టుబడ్డారు.
* డిసెంబర్ 4న ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ చెక్ పోస్ట్, నల్గొండ జిల్లాలోని విష్ణుపురం చెక్ పోస్టు, జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ చెక్ పోస్టుల్లో తనిఖీలు చేసి అక్రమంగా ఉన్న రూ.1.78 లక్షల నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* డిసెంబర్ 25న తాండురు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో, సీనియర్ అసిస్టెంట్ రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
2025 జనవరిలో..
* జనవరి 6న మహబుబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ జగదీష్ రూ.2 లక్షల లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో నిందితులకు సహకరిస్తూ పట్టుబడ్డారు.
* జనవరి 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
* జనవరి 15న జగిత్యాల జిల్లాకు చెందిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ను అవినీతి కేసులో రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సేల్ డీడ్ మెమో రాండం ఆఫ్ టైటిల్ డీడ్ అందజేయడం కోసం లంచం అశించారని ఫిర్యాదుదారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.