డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పద్మజ భూపాలపల్లి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు మంత శ్రీనివాస్ ప్రధాన ఉన్నత వైద్య అధికారి కొత్తగూడెం ప్రధాన వైద్య కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కి కృషి చేస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. వాతావరణంలోని హెచ్చుతగ్గులు సమతుల్యత పాటించాలి అంటే మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంతోష్ కుమార్ అనుకున్న పదికోట్ల మొక్కలు నాటే లక్ష్యానికి మనవంతుగా సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా మన సింగరేణి ప్రాంతంలో విపరీతంగా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు ఉంటాయి కావున దీన్ని మనం గోల్డ్ ఛాలెంజ్ గా తీసుకుని అందరూ విరివిగా మొక్కలు నాటి మనకు, భావితరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎంఓ నళిని, కమ్యూనికేషన్ సెల్ సిబ్బంది మరియు తోటి ఉద్యోగులు పాల్గొన్నారు.