నాగర్కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బిసి) సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం రాత్రి నుంచే సంఘటనాస్థలంలో ఉండి సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు, అందుకు తీసుకోవలసిన చర్యలపై ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర అధికారులు ఈ ప్రజావాణిని కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు.