రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా YSRCP నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు గ్రేటర్ విశాఖపట్నం జారీపేట లొని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన గ్రేటర్ విశాఖపట్నం కమీషనరు సృజన.
ఈసందర్భంగా కమీషనర్ సృజన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కూమార్ కి అభినందనలు తెలుపుతున్నాను అన్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ఉన్న 147 ప్రభుత్వ పాఠశాల ఆవరణలలో కూడ మొక్కలు నాటాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.