బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వరిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆయన ఆదేశించారు. కాగా, కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ఉద్యమకారుల్లోనూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ భావజాలవ్యాప్తిలో ముందు నుంచి బలమైన గొంతును వినిపించిన నాయకుడిగా దాసోజు శ్రవణ్‌కు పేరుంది. నిజానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి నుంచి నలుగురైదుగురు సీనియర్ల పేర్లు వినిపించాయి. పార్టీ అధినేత కేసీఆర్ అన్నివర్గాలు, అన్నిస్థాయిల ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు. చర్చోపచర్చల అనంతరం ‘ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలి’ అని కేసీఆర్ నిర్ణయించి దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
