గ్రూప్-2 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన టీజీపీఎస్సీ

 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచింది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలకాగా, 5 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ప‌రీక్షల‌కు 46 శాతం మంది అభ్య‌ర్థులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అంటే సగానికి సగం మంది మాత్ర‌మే గ్రూప్-2 ప‌రీక్ష‌ల‌ను రాశారు. 2024 డిసెంబ‌ర్ 15, 16న పరీక్షలు నిర్వహించారు.