అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడగింపు

తెలంగాణ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ కార్డుల గ‌డువును మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగించారు. ఈ మేర‌కు ఐ అండ్ పీఆర్ క‌మిష‌న‌ర్ హ‌రీశ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. మార్చి 30వ తేదీతో ముగియ‌నున్న అక్రిడేష‌న్ కార్డుల కాల ప‌రిమితిని జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. అక్రిడేష‌న్ కార్డుల గ‌డువును పొడిగించ‌డం ఇది నాలుగోసారి.