ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కు కూలీల బతుకులంటే విలువే లేదా..?

  • ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ అధికారుల అరాచకాలు ఎన్నాళ్ళు..
  • పక్క రాష్ట్రం నుంచి పనుల కోసం వస్తే ప్రాణాలు పోగొట్టుకోవాలా..
  • చనిపోయిన కుటుంబాలకు పరిశ్రమల శాఖ నష్ట పరిహారం ఇప్పించిందా..
  • అధికారులు ముడుపులు తీసుకోలేదు.. సరే జీతాలు తీసుకుంటున్నారు కదా..
  • మరణాలు సరే పరిశ్రమల ప్రమాదాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..
  • మీ కార్యాలయాల చిరునామాల గోప్యత వెనుకున్న అసలు కథేంటీ..
  • సామాన్యులకు దూరంగా ప్రభుత్వ శాఖలు ఎందుకు నడపబడుతున్నాయి..

సమాజానికి దూరంగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యవహారాలను చీకటి వ్యవహారాలు అంటారు. మరి సమాజానికి తెలియకుండా ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తుంటే వాటిని ఏ పేరుతో పిలవాలి.. అదే కోవకు చెందింది ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాలు అవి రాష్ట్రంలో, జిల్లాలలో ఎక్కడుంటాయో వాటి తాలూకు అడ్రస్ లు, ఫోన్ సంబర్లు సర మానవుడికి వెతికినా దొరకవు.. గూగుల్ లో వెతికితే ఏదైనా దాదాపుగా దొరికి తీరుతుంది.. కానీ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాలు ఎంత వెతికినా దొరకడంలేదు.. ఇక ఫోన్ నంబర్ల విషయానికొస్తే కంటికి కనబడవు. ఎవరైనా సామాన్యులు పిర్యాదు చేయాలన్న.. కొత్త పరిశ్రమలకు అనుమతులు తీసుకోవాలన్న వాళ్ళు ముప్పు తిప్పలు పడీ మూడు చెరువుల నీళ్లు తాగి రావాలి.. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాలకు ఎందుకీ పరిస్థితి వచ్చింది.. అడిగితే చిరునామాలు చెప్పరు.. అధికారుల ఫోన్ సంబర్లు కోరినా ఇవ్వరు.. పోనీ వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్పండి వస్తాము అని చెబితే.. సిబ్బంది తెలియదు అని జవాబు చెబుతారు.. అసలు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాల్లో ఎం జరుగుతుంది.. సామాన్యులకు దూరంగా అవి ఎందుకు నడపబడుతున్నాయి..

తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బిడిగా నడపబడుతున్న పరిశ్రమల్లో అసలు ఎం జరుగుతుందో ఆయా పరిశ్రమలలో ఎం తయారు చేస్తున్నారో ఎవరికీ అంతూ చిక్కడం లేదు.. కనీసం మనుషులు చనిపోతే కూడా బయటికి తెలియడం లేదంటే పరిశ్రమల శాఖలు ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయో అర్థమవుతోంది.. మన సిస్టంలో ఒకటుంది.. ముందు నుంచి చీమ పోవద్దు కానీ ఎనుక నుంచి ఏనుగులు, ఎలిక్యాఫ్టర్లు ఎగిరి పోవచ్చు.. బాధ్యత కలిగిన అధికారులు పట్టించుకోరు.. బాధ్యత తీసుకోవాలని చూస్తున్న మీడియాను లోనికి అనుమతించరు… లోపల జరగుతున్న గలీజు దందాలను ఎవరు వెలికి తీయాలి..

తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అన్న చందంగా వ్యవస్థలు పనిచేస్తే కూలి కోసం బతుకులను నెట్టుకొస్తున్న సామాన్యులు ఎక్కడికి పోవాలి.. కూలి బతుకులకు విలువలేదా.. గల్లీలో కుక్క ఛస్తే నిలదీసి అడుగుతున్న సమాజంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ ఎందుకు ఉండటం లేదు..? ఒక పరిశ్రమలో గతేడాది ఓ ప్రమాదం జరిగింది.. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా.. పరిశ్రమల నిర్వాహకులు లోనికి అనుమతించలేదు.. పొనీ అధికారులకు చెబుదామంటే లీవులో ఉన్నామని ఒకరు.. ప్రమాదంలో గాయపడిన కూలీలు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కాదట అబ్బా ఎందుకు గొడవ అని మరో అధికారి చెబుతున్నాడు.. అడిగితె గోడవన.. ప్రశ్నిస్తే నేరమా.. కెమెరా తీస్తే బ్లాక్ మెయిలా.. ఎక్కడున్నాం మనం.. పరిశ్రమల అధికారి సదరు ఫ్యాక్టరీ నిర్వాహకులకు ఎం చెప్పారో ఏమో తెలియదు గాని ఒక ఉద్యోగి వచ్చి రూ.3000 ఇవ్వాలని ప్రయత్నించాడు.. ఇంకా కావాలంటే ఇస్తాము దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండని చెప్పాడు. ఏంటీ కథ ఎందూకి దుర్మార్గం.. ఒక కాకి చనిపోతే పది కాకులు వచ్చి ఏడుస్తాయి.. కనీసం మనుషులు చచ్చిపోతే ఎందుకు చనిపోయారో తెలుసుకునే ప్రాథమిక బాధ్యత కూడా మీడియాకు లేదా.. ఆడవిలో ఉన్నామా.. ఆటవిక ప్రపంచం నడుస్తుందా.. ఎటుపోతోంది మన సమాజం.. ఎవరిని అడగాలి.. జవాబులేని ప్రశ్నలను.. గల్ఫ్ లో పని చేస్తూ ప్రాణాలు కోల్పోతే అయ్యో అంటున్నామే.. మన రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరంలో పొట్టచేత పట్టుకుని పక్క రాష్ట్రం నుంచి బతుకుదామని వచ్చిన వందలాది మంది కూలీల బతుకులు ఇక్కడే తెల్లారిపోతుంటే మన సిస్టం ఎం చేస్తున్నట్లు.. మన పరిశ్రమల శాఖ అధికారులు ఎటు చూస్తున్నట్లు.. ఇప్పటి వరకు పలు పరిశ్రమలలో కూలి పనిచేస్తూ గాయపడ్డ కూలీలు.. తీవ్ర గాయాలతో ప్రాణాలను కోల్పోయిన సంఖ్య లెక్కకు మించి ఉన్నప్పటికీ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయ అధికారులు ఒక్కటంటే ఒక్క కంపెనీపై చర్యలు తీసుకున్న ధాఖలాలూ లేవు.. దీనిని ఏమి అనాలి.. ఎలా అర్ధం చేసుకోవాలి.. అధికారులు అవినీతి పరులనా.. లేక జీతాలు తీసుకుని పనిచేయ లేకపోతున్నారని అనుకోవాలా.. అసమర్థులుగా మారి విధులు నిర్వహిస్తున్న కొంతమంది అధికారుల చేతుల్లో సిస్టం బందీ కావడం చేత కూలీల ప్రాణాలకు విలువలేకుండా పోయింది.

పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న పరిశ్రమల యాజమాన్యాలను ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారట.. నిజానికి పరిశ్రమల యజమాన్యాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలంటే ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయ అధికారుల క్లీయరెన్సు తప్పనిసరి.. పరిశ్రమలకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంటే చేతులు తడపాల్సిందే అంటున్నారు పలువురు పరిశ్రమల నిర్వాహకులు.. గత ఏడాది షాద్ నగర్ దగ్గరలో గల సౌత్ గ్లాస్ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనలో యజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.. అయినప్పటికీ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని సౌత్ గ్లాస్ ప్రమాదంపై అనుకూలంగా నివేదిక ఇచ్చినారని ఆరోపణలు వినబడుతున్నాయి..

ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓ ప్రత్యేకతను మూటగట్టుకుంది.. ఇక్కడికి ఏ అధికారివచ్చిన అంతో ఇంతో వెనుకేసుకుంటున్నారని టాక్ ఉంది.. గోల్డ్ ప్లేట్ జిల్లాగా టాక్ ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయ అధికారికి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక భారీ ఫార్మా పరిశ్రమ నుండి ప్రతి సంవత్సరం మూడు లక్షల రూపాయల మేరకు ముడుపుల రూపంలో ముడతున్నాయని ప్రచారం ఉంది.. ముడుపులు ముట్టిన తరువాతే అధికారులు పరిశ్రమలను సందర్శించి అంతా బావుందన్నట్లు ధృవీకరిస్తారని ఆఫ్ ది రికార్డుగా పరిశ్రమ ఉద్యోగులే చెబుతున్నారు. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసిన అధికారి సంపాదన కోట్లలో ఉందని అతనిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతధికారులు చర్యలు తీసుకోలేదని సమాచారం. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ పై మరోకథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..(సోర్స్: ఆదాబ్ హైదరాబాద్)