ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. గంగాజమున తెహజీబ్‌కు తెలంగాణ నిలయమన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి చేశామని తెలిపారు. మత సామరస్యం, లౌకికవాద పాలనతోనే శాంతిభద్రతలు నెలకొంటాయని చెప్పారు. అభివృద్ధికి సామాజిక ప్రశాంతత కీలకమని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ విధానాలను కొనసాగిస్తే మరింత ప్రగతి సాధ్యమని తెలిపారు.