జల కాలుష్యంతో మానవాళికి ముప్పు

  • పారిశ్రామికవ్యర్థాలతో ప్రమాదకరంగా మారుతున్న చెరువులు, నదులు..

నదులు, చెరువులు పర్యావరణ వ్యవస్థకు కీలకమైనవని. అవి వరద నియంత్రణ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్యానికి కూడా సహాయపడతాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా నదులు ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణమార్పు, బాధ్య తారహిత అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల అవి మరింతగా విచ్చిన్నం, కలుషితమవుతూ బలహీనపడుతున్నాయి. నదులు, చెరువులు ప్రమాదంలో ఉన్నప్పుడు, మన సమిష్టి భవిష్యత్తు కూడా అంతే ప్రమాదంలో ఉంది. ఆరోగ్యకరమైన నదులు, చెరువులు పరిశుభ్రమైన నీటిని పొందడం మనందరినీ కలిపే ప్రాథమిక మానవ హక్కులు, మంచినీటి జాతులు 1970 నుండి 83 శాతం క్షీణతను చూశాయి. ఇది భూసంబంధమైన లేదా సముద్ర వాతావరణాలలో అనుభవించిన క్షీణత రేటు కంటే రెండింతలు. ప్రపంచవ్యాప్తంగా నదులు, చెరువుల క్షీణత, కాలుష్యం ఒక ముఖ్యమైన పర్యావరణ సమస్య. ఇది ప్రధానంగా పారిశ్రామికవ్యర్థాలు, శుద్ధిచేయని మురుగునీరు, వ్యవసాయ ప్రవాహం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పట్టణీకరణ, అటవీ నిర్మూలన, తగ్గిన నీటివడపోత పెరిగిన కోత, వాతావరణ మార్పు మొదలైన కారణాల వల్ల సంభవిస్తుంది. గంగా, యమునా సిటారమ్, యాంగ్జీ మతం జారియాచులో నది వంటి ప్రధాన నదులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఇవి తరచుగా కలుషితమైన నీటి వనరుల కారణంగా జీవవైవిధ్యం కోల్పోవడం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, పర్యావరణ అంతరాయం, జలజీవులు మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

వాతావరణ మార్పు, భూ వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా 402 బేసిన్లలో నదీ ప్రవాహం తగ్గింది. ఇది 2000 సంవత్సరం నుండి ఐదురెట్లు పెరుగుదల, పరిశోధకులు 89 దేశాలలో 75,000 కంటే ఎక్కువ నీటి వనరులను సర్వే చేశారు. 40 శాతానికి పైగా తీవ్రంగా కలుషితమైందని కనుగొన్నారు. ఒక నివేదిక ప్రకారం 90 దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా, మధ్య, ఆగ్నేయాసియాలో నదీ క్షీణతను ఎదుర్కొంటున్నాయి. 2030 నాటికి మానవాళిలో సగానికిపైగా కరువు, వరదలు, మురుగు నీటి కాలుష్యం, తగినంత నీటినాణ్యత లేని దేశాలలో నివసిస్తారు. 47 దేశాలు అంతర్జల వనరుల నిర్వహణని వూర్తిగా చేరుకున్నాయి. 63దేశాలు అంతర్జల వనరుల నిర్వహణ అమలును వేగవంతం చేయాలి. అయితే 73 దేశాలు అంతర్జల వనరుల నిర్వహణ కోసం పరిమిత సామర్ధ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం, ప్రపంచం 2049 నాటికి స్థిరమైన నీటి నిర్వహణను సాధిస్తుంది. దీనిఅర్థం 2030 నాటికి 100 కంటే ఎక్కువ దేశాలలో కనీసం 3.3 బిలియన్ల మంది ప్రజలు నీటి డిమాండ్లను సమతుల్యం చేయడానికి అసమర్థమైన పాలనను కలిగి ఉండే అవకాశం ఉంది. భారత దేశంలో నదీ కాలుష్యం నిర్వహణ భారతదేశంలో కూడా నదీ క్షీణత కాలుష్యం ఒక ముఖ్యమైన పర్యావరణ సమస్య. ప్రధానంగా శుద్ధి చేయని మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు సరికాని వ్యర్థాలను పారవేయడం వల్ల ఇది సంభవిస్తుంది. దీని వలన కలుషితమైన నీరు మానవ వినియోగానికి పనికి రాకుండా పోతుంది. గంగా యమునా వంటి ప్రధాన నదులలో జలచరాలకు హాని కలిగిస్తుంది. 60శాతం కంటే ఎక్కువ మురుగునీరు నేరుగా నదులలోకి విడుదలవుతుంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్రమైన కాలుష్య సమస్యలకు దోహదం చేస్తుంది. భారతదేశంలోని ప్రధాన నగరాలు రోజుకు 38,354 మిలియన్ లీటర్ల మురుగు నీటిని ఉత్పత్తి చేస్తాయి. కానీ పట్టణ మురుగు నీటిశుద్ధి సామర్థ్యం 11,786 మాత్రమే. భారతదేశంలో సగటు వార్షిక వర్షపాతం దాదాపు 4000 బిలియన్ క్యూబిక్ మీటర్లు అయినప్పటికీ, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల దాదాపు 1122 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటివనరులు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. కాలుష్యం నీటి నాణ్యతను క్షీణింపజేస్తుంది. కాబట్టి ఈనీటిలో ఎక్కువ భాగం సురక్షితం కాదు. నీటి కాలుష్యం భారతీయ వినియోగదారులకు, దాని పరిశ్రమకు వ్యవసాయానికి అందుబాటులో ఉన్న నీటి మొత్తాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది. భారతదేశంలో నదీ నిర్వహణను ప్రధానంగా జలశక్తి మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా భారతదేశంలో అత్యంత కలుషితమైన నదులలో ఒకటైన గంగాను శుభ్ర పరచడం, పునరుజ్జీవింప జేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐక్యరాజసమితి జనరల్ అసెంబ్లీ 2021-2030ని పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది.