తెలంగాణ భవన్‌లో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు..

మాజీ ఉపప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసన మండలిలో ప్రతిపక్షనేత ఎస్.మధుసుదానా చారి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్‌కు భారత రత్న ఇవ్వాలని మధుసూదనా చారి డిమాండ్ చేశారు. రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు విరుద్ధంగా పని చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.