ఇంట్లో విద్యుత్ మీట ర్‌లో అవకతవకలకు పాల్పడ్డావంటూ వి ద్యుత్ వినియోగదారుడిని బెదిరించి 20,000 రూపాయలను వసూలు చేయడా నికి ప్రయత్నించిన ఓ విద్యుత్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళ వారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టు కున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధ ర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్‌నగర్ జిర్రా లో నివసించే ఉమర్ ఇంట్లో విద్యుత్ మీటర్‌కు తీగలు మార్చాడు.
దీనిని గమనించిన మంగల్ హాట్ సబ్ స్టేషన్ కు చెందిన అబ్దుల్ రెహమాన్ అనే ఆర్టిజన్ మీటర్లో అవకతవకలకు పాల్పడ్డావని బెదిరించాడు. తనకు 20 వేల రూపాయలు ఇస్తే మీటర్‌ను సరి చేస్తానని ఓమర్‌కు చెప్పాడు. దీంతో మంగళవారం సాయం త్రం ఉమర్ 20వేలను అబ్దుల్ రెహమాన్‌కు ఇస్తుం డగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకు న్నారు. అనంతరం మంగల్‌హాట్ సబ్‌స్టేషన్‌లో విచా రణ చేపట్టారు. లంచాలు అడిగితే ఫిర్యాదు చేయాలని డీఎస్పీ గంగసాని శ్రీధర్ చెప్పారు.