తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు పేపర్‌కు రూ. 100 చొప్పున, రీవెరిఫికేషన్‌కు పేపర్‌కు రూ. 600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో అమ్మాయిలు సత్తా చాటారు. ఫస్టియర్ ఫలితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్‌లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరు కాగా, 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు.