
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఆప్ అధ్యక్షుడు , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు . ఈ మేరకు కేసీఆర్ ఆయనకు అభినందన సందేశం పంపారు . కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని , ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలవుతాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు . ప్రజలే కేంద్రంగా ఆలోచించి పాలన చేస్తే తప్పక ప్రజాభిమానం పొందుతారనడానికి కేజ్రీవాల్ విజయం ఓ ఉదాహరణ అని సీఎం కేసీఆర్ అన్నారు .