తెలంగాణ ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురు నియామకం

 తెలంగాణ ఆర్టీఐ క‌మిష‌న‌ర్లుగా న‌లుగురు నియామ‌కం అయ్యారు. ఆర్టీఐ కమిషనర్లుగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మోహ‌సినా ప‌ర్వీన్, దేశాల భూపాల్ పేర్లను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే రామ‌కృష్ణ‌రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేయించారు.